పారిశ్రామిక రంగం పరుగులు

0
18

కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనా తెలంగాణ పారిశ్రామిక రంగంలో మాత్రం దూకుడుగా మున్ముందుకు పరుగులు తీస్తున్నది. జాతీయ సగటు అభివృద్ధిని మించి ప్రగతి దిశగా ముందుకెళుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 8.30% ప్రగతి రికార్డయిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై ప్రణాళికాశాఖ రూపొందించిన నివేదికను మీడియాకు విడుదలచేశారు. జాతీయ సగటు పురోగతి రేటు 8.1 శాతమే. 2015 – 16 తొలి ఆరు నెలల్లో రూ.29,614 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించగా, ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య అది రూ.32,085 కోట్లకు చేరుకున్నది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.14,404 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించిన పారిశ్రామిక రంగం నిర్మాణ రంగంలో గణనీయ అభివృద్ధి నమోదుచేసిందని మంత్రి ఈటల చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి భాగంలో జాతీయ సగటు ప్రగతి 2.5 శాతమైతే.. తెలంగాణలో 6.6 శాతం రికాైర్డెంది. 2015 – 16 తొలి ఆరు నెలల్లో 12,033 కోట్ల విలువైన పనులు జరిగితే ఈ ఏడాది అది రూ.12,830 కోట్లకు చేరాయని అర్థ గణాంక శాఖ నివేదిక తెలిపింది.

LEAVE A REPLY