పారసిటమాల్ మాత్ర కన్నా బీరు మెరుగైన పెయిన్‌కిల్లర్‌

0
27

పారసిటమాల్ మాత్ర కన్నా బీరు మెరుగైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేస్తుందట. బీరును కొద్దిపాటి మోతాదులో తీసుకుంటే పారసిటమాల్ మాత్ర కన్నా బాగా పనిచేసినట్లు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు తెలిపారు. గ్రీన్‌విచ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 400 మందిపై 18 రకాల పరిశోధనలు చేశారు. మెదడు గ్రాహకంపై పనిచేయడం ద్వారా నొప్పి తీవ్రతను, ఆందోళనను బీరు తగ్గిస్తుందా, లేదా అనే విషయంపై అధ్యయనం చేశారు. ఎక్కువ బీరు తాగిన వ్యక్తులకు తక్కువ నొప్పి ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు. బీరు తాగిన వ్యక్తుల్లో ఆల్కహాల్ సమర్థవంతమైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేసినట్లు బలమైన ఆధారం కనుగొన్నాం. పారసిటమాల్ మాత్ర కన్నా ఆల్కహాల్ మరింత ప్రభావం చూపింది అని ట్రెవర్ థాంప్సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. దుష్ప్రభావాలు లేని మందులనూ ఆల్కహాల్‌తో తయారు చేయవచ్చని అన్నారు

LEAVE A REPLY