పాదయాత్రకు సంకల్పించిన మాజీ మంత్రి డీకే అరుణ

0
23

పాలమూరు ప్రాంతంలోని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించడంతో ఇది తీవ్రరూపం దాల్చనుంది. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి సన్నిధి నుంచి ఆదిలాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టాలని ఆమె నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో పాటు ఏఐసీసీ నేతలకు లేఖలు రాశారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌కు సంబంధించి కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి సైతం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి పీసీసీ సమావేశంలో సైతం ఆమోదముద్ర లభించింది. తాజాగా డీకే అరుణ పాదయాత్ర తెరపైకి రావడంతో జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here