పాతనోట్లు ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష

0
40

న్యూఢిల్లీ: ఇవాళ అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పాత నోట్లపై కొత్త నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు కలిగి ఉంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ ను రూపొందించింది. వచ్చే మార్చి తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష విధించనుంది. పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి భవన్ కు పంపాలని నిర్ణయించింది. మార్చి 31వ తేదీ తర్వాత పాత నోట్లను మార్చుకుంటే, వాళ్లకు 5 వేల జరిమానా విధించనున్నారు. అయితే పాత నోట్లను డిపాజిట్ చేయడంలో మాత్రం డెడ్ లైన్ మార్చలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here