పాతనోట్లు ఉంటే పారేసుకోకండి

0
24

రద్దయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేయలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై మరో రెండు వారాల్లో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం మంగళవారం హామీ ఇచ్చింది. పాతనోట్లు మార్చుకోవడంపై తేదీలు హఠాత్తుగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని కేంద్రాన్ని కోర్టు నిలదీసింది. సర్కారు మాట మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సర్కారు తీరును కోర్టు తప్పుబట్టింది.

మార్చి చివరి వరకు నగదు జమ చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దాంతో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని సర్కారు తరఫున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. 2016 డిసెంబర్ 30 లోగా నిజమైన ఇబ్బందుల కారణంగా నోట్లు జమచేయలేక పోయినవారు ఆ తర్వాత 2017 మార్చి 31 వరకు రిజర్వ్‌బ్యాంక్ శాఖల్లో వాటిని మార్చుకోవచ్చని ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు అని ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

LEAVE A REPLY