పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ కబడ్డీ

0
19

తెలంగాణ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో జరుగుతున్న పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్ తుదిఘట్టానికి చేరుకుంది. బాలుర, బాలికల విభాగాల్లో ఫైనల్ ప్రత్యర్థులెవరో ఖరారైంది. బాలుర విభాగంలో గుజరాత్, హర్యానా ఫైనల్ చేరుకోగా, బాలికల్లో హర్యానా, మహారాష్ట్ర తుదిసమరానికి సిద్ధమయ్యాయి. బాలుర సెమీఫైనల్స్‌లో పంజాబ్‌పై 53-32తో గుజరాత్, ఢిల్లీపై 75-23తో హర్యానా, బాలికల్లో ఢిల్లీపై 43-21తో హర్యానా, కర్ణాటకపై 40-18తో మహారాష్ట్ర విజయం సాధించాయి. బుధవారం ఫైనల్స్ జరుగనున్నాయి.

LEAVE A REPLY