పాటపాడిన కిరణ్‌

0
18

అమీర్‌ ఖాన్‌ దంగల్‌లోని ‘ధాకడ్‌’ పాట పాడి వారెవ్హా! అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆతని భార్య కిరణ్‌ కూడా అదే బాట పట్టింది. అయితే ఆమె పాడబోతున్న పాట సినిమాలకు సంబంధించినది కాదు. మహారాష్ట్రలోని కరవు బాధిత గ్రామాలకు సాయమందించే పానీ ఫౌండేషన్‌ అనే ఓ నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ వచ్చే ఏప్రిల్‌లో ‘వాటర్‌ కప్‌ కాంపిటీషన్‌’ అనే పోటీని నిర్వహించబోతోంది. ఈ పోటీ గురించిన ప్రచారంలో భాగంగా ఆ సంస్థ ఓ వీడియోను రూపొందించే పనిలో ఉంది. ఈ వీడియోలో వినిపించే ‘సత్యమేవజయతే వాటర్‌ కప్‌ యాంథెమ్‌’ను కిరణ్‌ పాడుతోంది. పూర్తి మరాఠీలో సాగే ఈ పాటకు కిరణ్‌ రావ్‌ గొంతునందిస్తే వీడియోలో అమీర్‌ నటించటం మరో విశేషం.

LEAVE A REPLY