పాక్ బండారాన్ని బయటపెట్టిన కిసింజర్

0
19

పాకిస్థాన్ ఇచ్చిన మాట తప్పి భారత్ స్థావరాలపై దాడికి పాల్పడటం వల్లనే బంగ్లా యుద్ధం తలెత్తిందని అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ అట్లాంటిక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా ఒత్తిడిమేరకు తూర్పు పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇచ్చేందుకు పాక్ అంగీకరించిందట. రేపోమాపో ప్రకటన వెలువడుతుందని అనుకుంటుండగా నెల తర్వాత హఠాత్తుగా భారత వైమానిక స్థావరాలపై దాడికి తెగబడింది. అప్పటి ప్రధాని ఇందిర నిర్ణయాత్మకంగా వ్యవహరించి యుద్ధానికి సిద్ధపడ్డారు. పాక్‌ను చిత్తుగా ఓడించి విజయేందిర అనిపించుకున్నారు. 1971 డిసెంబర్ 3న పాక్ జరిపిన దాడిని భారత్ బలంగా తిప్పికొట్టింది. తూర్పుపాకిస్థాన్‌లోని విముక్తి దళాలకు మద్దతుగా రంగంలోకి దిగి పాక్‌ను మట్టికరిపించింది. ఈ యుద్ధమే బంగ్లా యుద్ధంగా ప్రసిద్ధి పొందింది. తూర్పు పాకిస్థాన్‌కు స్వయం ప్రతిపత్తి ఇచ్చే ఉద్దేశమే ఉంటే సరిహద్దులకు సమీపంలో ఉన్న భారత వైమానిక స్థావరాలపై ఎందుకు దాడులు చేస్తుంది? ఆపరేషన్ చెంగిజ్‌ఖాన్ పేరిట జరిపిన పాక్ దాడులు యుద్ధానికి దారితీశాయి. నైతిక బలమున్న బాంగ్లా ప్రజల వైపు నిలిచిన భారత్ ఆ యుద్ధంలో విజయం సాధించింది. భారత్ వత్తాసుతో చివరకు స్వతంత్ర బాంగ్లాదేశ్ అవతరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here