పాక్ అధ్యక్షుడిపై కేసుపెట్టిన ఆరో తరగతి విద్యార్థి

0
21

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అధ్యక్షుడు మామ్‌నూన్ హుస్సేన్‌పై ఆరోతరగతి విద్యార్థి(11) మహ్మద్ సాబీల్ హైదర్ కేసు పెట్టాడు. పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 141వ పుట్టినరోజు సందర్భంగా తాను ఇవ్వనున్న ప్రసంగాన్ని అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది దొంగిలించారని, ఇందుకు తన సమ్మతిని తీసుకోలేదని ఆరోపించారు. ఈ మేరకు హైదర్ తండ్రి నాసీమ్ అబ్బాస్ నాసీర్‌తో కలిసి శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు సదరు విద్యార్థి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం తీర్పు ను రిజర్వ్‌లో ఉంచింది. జిన్నా జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నెల 14న అధ్యక్షుడి కార్యాలయ సిబ్బంది తనను పిలిచి ప్రసంగించాల్సిందిగా కోరిందనీ, అప్పటి నుంచి ప్రసంగించేందుకు రిహార్సల్స్ చేయడంతో ఇంగ్లిష్, సైన్స్ పరీక్షలు రాయలేకపోయానని అన్నాడు. ఈనెల 22న అధ్యక్షుడి కార్యాలయంలో తన ప్రసంగాన్ని మరో స్కూల్ విద్యార్థిని ప్రసంగించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపాడు. అధ్యక్షుడి కార్యాలయ సిబ్బం ది తన ప్రసంగాన్ని దొంగిలించారని ఆరోపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here