పాక్ అకృత్యాలపై గళమెత్తిన బలూచ్

0
19

తమపై పాకిస్థాన్, చైనా అకృత్యాలను నిరసిస్తూ వివిధ దేశాల్లో బలూచ్ కార్యకర్తలు ప్రదర్శనలు చేపట్టారు. తమపై పాకిస్థాన్ యంత్రాంగం అకృత్యాలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ జెనీవాలోని ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జర్మనీ తదితర ఈయూ దేశాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం బలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ), బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ (బీఎన్‌ఎం), బలూచ్ విద్యార్థి సంస్థలు (బీఎస్వో ఆజాద్), బలూచ్ రిపబ్లికన్ విద్యార్థుల సంస్థ (బీఆర్‌ఎస్వో) సంయుక్తంగా ఈ ప్రదర్శనలకు నాయకత్వం వహించాయి. జెనీవాలో ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం బయట బ్రోకెన్ చైర్ వద్ద జరిగిన ప్రదర్శనలో బలూచ్ కార్యకర్తలు పాక్, చైనాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

LEAVE A REPLY