పాక్‌ చేతికి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌..?

0
39

కరాచీ పోర్టుకు చేరుకున్న చైనా న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ పాకిస్థాన్‌ చేతికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ నావికాదళ సిబ్బంది దీని పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా ఇదేదో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల దృష్ట్యా ఇచ్చిన అవకాశం అనుకంటే పొరపాటే..! అణుజలాంతర్గామిలోకి సమీప దేశ సైనిక సిబ్బందిని అనుమతించడం సామాన్యమైన విషయం కాదు. భారత నావికాదళం మాత్రం పాకిస్థాన్‌.. చైనా సబ్‌మెరైన్‌ను లీజుకు తీసుకుని ఉండవచ్చని చెబుతోంది. ప్రస్తుతం అక్కడ సబ్‌మెరైన్‌ ఆపరేషన్స్‌కు సంబంధించి మొదటి బృందానికి శిక్షణనిస్తున్నట్లు పేర్కొంటోంది. ఒక వేళ పాక్‌ దీనిని కొనుగోలు చేసినట్లైతే.. హిందూ మహాసముద్ర తీరంలో ఆయుధపోటీ మరింత తీవ్రమవుతుంది.

LEAVE A REPLY