పాక్‌లో భారత సినిమాలపై నిషేధం ఎత్తివేత

0
16

కరాచీ: పాకిస్థాన్‌లో భారతీయ చిత్రాలపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్‌ థియేటర్‌ యజమానులు ప్రకటించారు. దీంతో సోమవారం(డిసెంబరు 19) నుంచి పాక్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శించనున్నారు. థియేటర్‌ యజమానులందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. భారతీయ చిత్రాలపై తాత్కాలిక నిషేధం వల్ల దానిపై ఆధారపడిన థియేటర్ల యజమానులు, ఇతర వ్యాపారులపై ఆ ప్రభావం పడుతోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ జోరైష్‌ లషరి తెలిపారు. థియేటర్‌ యజమానులు తమంతట తాము భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేశారే కానీ.. నిషేధం విధించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రం కోసం పాక్‌ ఎదురుచూస్తున్నట్లు కొన్ని ప్రైవేటు మీడియా వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY