పశుమాంసం తింటాం, వద్దనడానికి మీరెవరు?

0
18

కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, గోరక్షకులకు తమిళనాడులోని పలు విద్యార్థి సంఘాలు సవాళ్లు విసురుతున్నాయి. గోరక్ష పేరుతో మీరు పశువిక్రయాలను నిషేధిస్తే ఒప్పుకోం, పశుమాంసాన్ని తింటాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ విప్లవ యువ విద్యార్థి సంఘం(ఆర్‌ఎస్‌వైఎఫ్), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ), అంబేద్కర్ పెరియార్ విద్యార్థి సంఘం(ఏపీఎస్‌సీ), తందై పెరియార్ ద్రవిడ కజగమ్(టీపీడీకే) విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఎదుటే బుధవారం బాహాటంగా పశుమాంస వంటకాలు తిన్నారు. ఆదివారం బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సూరజ్ అనే పీహెచ్‌డీ విద్యార్థిపై హిందూత్వవిద్యార్థులు మంగళవారం జరిపిన దాడికి నిరసనగా వారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఐఐటీ క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

LEAVE A REPLY