పవర్‌ ప్రాజెక్టులంటూ రూ.కోట్లలో టోకరా

0
22

చదివింది ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ వర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. తిరిగి వచ్చి ప్రాజెక్టులు చేపట్టి… నష్టాలు చవిచూసి… చివరకు రెండు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ పేరుతో మోసాలకు తెరలేపాడు బోజ్‌ అగస్టియన్‌. దేశ వ్యాప్తంగా వందల మందిని ముంచిన ఈ తమిళనాడు మదురై వాసి బాధితుల జాబితాలో హైదరాబాదీతో పాటు ప్రముఖులూ ఉన్నారు. అనేక రాష్ట్రాల పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఇతడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారని అదనపు సీపీ స్వాతి లక్రా మంగళవారం తెలిపారు. డీసీపీ అవినాష్‌ మహంతి, ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

LEAVE A REPLY