పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్!

0
17

రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 4న అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల విడుదలైన థియేట్రికట్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే నాలుగు మిలియన్ల మంది వీక్షించారు. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో గొప్ప చిత్రంగా మిలిగిపోతుంది. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నాం. మెగాభిమానులందరు ఈ వేడుకకు తరలివస్తారు అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది.

LEAVE A REPLY