పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా రియాక్షన్!

0
35

జనసేన అధనేత పవన్ కల్యాణ్ టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. సుజనా చౌదరి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టలేదని చెప్పారు. పవన్ రాజధాని సమస్యలు, ఉద్దానం సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని ఉమా చెప్పారు. సుజనా చౌదరి, రాయపాటిపై పవన్ వ్యాఖ్యలు సరికాదని ఉమా అభిప్రాయపడ్డారు. వారిద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని బొండా ఉమ స్పష్టం చేశారు. అయితే పందుల ఆటలు ఆడుకోమంటూ సుజనా చేసిన వ్యాఖ్యలు తప్పేనని బోండా ఉమా చెప్పడం విశేషం. పవన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY