పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌

0
21

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటామని, ఇందుకు కార్యాచరణను రూపొందిస్తామని, సమస్యకు మూలాలు తెలుసుకుని నివారిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కంటే .. ముఖ్యమంత్రికే ఈ సమస్య గురించి బాగా అర్థమయిందని వ్యాఖ్యానించారు. సమస్యను సీఎం తీవ్రంగానే తీసుకున్నారని, కార్యాచరణను అమలు చేస్తారన్న విశ్వాసం ఉందని పవన్‌ చెప్పారు. కిడ్నీ బాధితుల పక్షాని నిలిచి చేసిన పోరాటానికి తొలి విజయం లభించిందని.. మున్ముందు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమస్య సంపూర్ణంగా సమసిపోయే దాకా ప్రతి రాజకీయ పార్టీ స్పందించాలని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY