పవన్‌తో రామకృష్ణ భేటీ.. జనసేనతో సీపీఐ దోస్తీ!

0
15

హైదరాబాద్ : సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను గురువారం ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ నేతలు ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావులు కలుసుకున్నారు. వారిని పవన్ సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, భూసేకరణ కారణంగా తలెత్తిన సమస్యలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఇది కేవలం స్నేహపూర్వక భేటీ అని పవన్, రామకృష్ణ అన్నారు. భావసారూప్యత కలిగిన ప్రజాసమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయంపై ఆలోచన చేసినట్లు రామకృష్ణ తెలిపారు.

LEAVE A REPLY