పళని, రజనీ ఇళ్ళలో బాంబులు ?

0
8

తమిళనాడు సీఎం పళని స్వామి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇళ్ళలో బాంబులు పెట్టినట్టు ఓ ఆగంతకుడు శనివారం చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారి ఇళ్ళలో తనిఖీలు చేయగా బాంబులేవీ కనబడకకపోవడంతో. ఆ ఫోన్ కాల్ వట్టిదేనని తేల్చారు.

ఈ కాల్స్ ను ట్రేస్ చేసిన ఖాకీలు..భువనేశ్వరన్ అనే 21 ఏళ్ళ యువకుడ్ని అరెస్ట్ చేశారు. కడలూరుకు చెందిన ఇతనికి సరిగా మతిస్థిమితం లేదని తెలిసింది. గతంలోనూ ఇలాంటి పనులకు భువనేశ్వరన్ పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 2013 లో నాటి సీఎం జయలలిత ఇంట్లో బాంబు పెట్టినట్టు కాల్ చేయగా ఆ సమయంలోనూ ఇతడ్ని వారు అరెస్టు చేశారు.

LEAVE A REPLY