పరిహారంపై అత్యాశ వద్దు

0
29

‘వ్యవసాయంలో సంక్షోభం పోవాలి. అందుకే.. పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని విధాలా కష్టపడుతున్నాం. రైతులకు ఉపయోగపడేలా పోలవరం పనులను ఒక కొలిక్కి తెస్తున్నాం. కానీ కొందరు దుష్టులు, దుర్మార్గులకు ఈ పని ఇష్టంలేనట్టుగా కనిపిస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తూ కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. ఎవరైనా రెచ్చిపోతే అది మనకే నష్టం. పోలవరం ప్రాజెక్టులో కులమతాలు లేవు. ఇప్పుడు చేసే పనులన్నీ వీటికి అతీతమే. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులకు, క్రస్టు గేట్ల తయారీకి బుధవారం ఆయన లాంఛనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిధిలో అన్ని పనులూ ప్రారంభించామని, ఇప్పుడు ప్రాజెక్టుకు గుండెకాయ వంటి డయాఫ్రమ్‌వాల్‌ పనులను ప్రారంభించామని వ్యాఖ్యానించారు. ‘ఇది అత్యంత కీలకం. అందుకనే భారీ యంత్రాలను రప్పించాం. దుబాయ్‌లో అత్యంత ఎత్తయిన బుర్జ్‌ఖలీఫా నిర్మాణాన్ని పూర్తి చేసిన జర్మనీ కంపెనీ బావర్‌, ఎల్‌అండ్‌టీ కంపెనీలు ఇప్పుడు డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి. సుమారు 70 వేల చదరపు మీటర్ల డయాఫ్రమ్‌వాల్‌ పనులను ఈ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. 150 మీటర్లు భూగర్భంలోకి వెళ్లే యంత్రాలను తీసుకొచ్చారు. ఇసుక, మెటల్‌, వాటర్‌, బెంటినెట్‌ ద్రావణం మొత్తం కలిపితే ఒక క్యూబిక్‌ మీటర్‌కు 363 కిలోలు వాడతారు. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ పనులను రెండుగా విడదీశాం. మొదటి భాగం ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. క్రస్టల్‌ రేడియల్‌ గేట్లు ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లు. వీటి నిర్మాణానికి విశాఖ, బిలాయ్‌ ఉక్కు కర్మాగారం నుంచి స్టీలు ప్లేట్లు రప్పిస్తున్నారు’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here