పరిశ్రమలకు నిలయంగా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం

0
10

కల్యాణి గ్రూప్ సంస్థ ఇజ్రాయెల్ సహాకారంతో ఇబ్రహీంపట్నంలో మిస్సైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీసీఎస్ సంస్థ 20వేల ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఆదిబట్లలో ఏర్పాటు చేసిందన్నారు. మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపూర్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. నకిరేకల్‌లో డ్రైపోర్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రిలో రూ.రెండువేల కోట్లతో పనులు సాగుతున్నాయని చెప్పారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలును తేబోతున్నామని, ఈ ప్రాంతంలోని ఉద్యోగులకు రవాణాసౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చొరవతో బీబీనగర్‌కు ఎయిమ్స్ వచ్చిందన్నారు. ఆలేరులో దేశం అబ్బురపడేలా ఫర్మిచర్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడి నుంచి విదేశాలకు ఫర్నిచర్ ఎగుమతిచేసేలా పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌ను రూపొందించాలన్న ప్రణాళికలకు కేంద్రం సహాయం చేయడంలేదని విమర్శించారు. పారిశ్రామిక రంగంలో కొత్త పాలసీలు, రాయితీలు రావాల్సిన విషయం తమకు తెలుసన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here