పద్మజ ఫెర్టిలిటీ సెంటర్‌పై ఐటీ దాడులు

0
21

హైదరాబాద్ హబ్సి గూడలోని పద్మజ ఫెర్టిలి టీ సెంటర్, భువనగిరిలోని నవ్య నర్సింగ్ హోం పై మంగళ వా రం ఆదాయంపన్నుశాఖ అధికారులు దాడులుచేశారు. డాక్టర్ పద్మజాదివాకర్ రెండు చోట్ల దవాఖానలు నిర్వహిస్తు న్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. డాక్టర్ పద్మజా దివాకర్ ఆస్తులు లెక్కకుమించి ఉన్నట్టు గుర్తించారని సమాచారం. డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ వైద్యురాలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. హబ్సిగూడలో సంతానసాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నారు. సరోగసీ ద్వారా పలు కాన్పులు చేసిన రికార్డులు, వచ్చిన ఆదాయ వివరాల లెక్కలు తీస్తున్నట్లు తెలిసింది. పదిమంది అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. పూర్తివివరాలు తెలి యాల్సి ఉన్నది. నల్లగొండలోనూ దాడులు కొనసాగాయి.

LEAVE A REPLY