పదో తరగతి పరీక్షల షెడ్యూల్

0
34

తెలంగాణ: రాష్ట్రంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను మార్చి 24 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శేషుకుమారి ఎస్సెస్సీ టైంటేబుల్ విడుదల చేశారు. ఈ సారి మైనర్ పరీక్షలు ఓఎస్‌ఎస్‌సీ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్షలను ముందుగా నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఈ పరీక్షలను చివరిలో నిర్వహించేవారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అప్పటికి ఇంకా కొనసాగనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ తెలిపారు. మార్చి 17 నుంచి 30 వరకు పదో తరగతి ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఫస్ట్ లాంగ్వేజీ కంపోజిట్ కోర్సు, సెకండ్ లాంగ్వేజీ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తారు.

LEAVE A REPLY