పదోతరగతి విద్యార్థితో రూ. 5కోట్ల ఎంవోయూ

0
30

వైబ్రంట్ గుజరాత్ సదస్సులో ఓ కుర్రాడు చరిత్ర సృష్టించాడు. ఏకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో రూ. 5కోట్ల ఎంవోయూ చేసుకున్నాడు. హర్ష్‌వర్ధన్ జాల పదోతరగతి విద్యార్థి. తన వ్యాపార ప్రణాళికలో భాగంగా ల్యాండ్‌మైన్ల గుర్తింపుతోపాటు నిర్వీర్యంలో సహాయపడే డ్రోన్ల నమూనాలను రూపొందించారు. వాటిని వైబ్రంట్ గుజరాత్ సదస్సులో ప్రదర్శించాడు. డ్రోన్ల తయారీకి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు జాలతో గుజరాత్ రాష్ట్ర శాస్త్ర, సాకేంతిక శాఖ రూ. 5కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా జాల మాట్లాడుతూ ల్యాండ్ మైన్లను గుర్తించి, నిర్వీర్యం చేసే క్రమంలో ఎంతో మంది సైనికులు మృతిచెందడం, గాయపడడం వంటి సంఘటనలను టీవీల్లో చూశానని తెలిపారు.

LEAVE A REPLY