పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్: 39మంది మృతి

0
34

విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 18448 రైలు పట్టాలు తప్పింది. కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతుండగా శనివారం రాత్రి 11 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ తో సహా రైలులోని ఎనిమిది బోగిలు పట్టాలు తప్పడంతో 39 మంది మృతి చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనెందుకు రైల్వే సిబ్బంది బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహాయక చర్యల్లో పాల్గొనెందుకు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఎస్8, ఎస్9 బోగీలు మొత్తం దెబ్బతిన్నాయి. ఏసీ3టైర్, ఏసీ 2టైర్ బోగులు, జనరల్ బోగీలు, లగేజీ బోగి పట్టాలు తప్పాయి. నాలుగు అంబులెన్స్‌తో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY