పకడ్బందీగా సబ్‌ప్లాన్

0
14

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలకోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలుచేసినప్పటికీ.. ఇంకా ఆ వర్గాలలో పేదరికం పోలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీలే అత్యంత పేదరికం అనుభవిస్తున్నారని అన్నారు. వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అంద రం కలిసి ఆలోచించి, విధానం రూపొందించుకొని, పకడ్బందీగా అమలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ మేరకు సబ్‌ప్లాన్‌లో సమూల మార్పులు రావాలన్నారు. అదే సమయంలో ఎస్టీలకు ఏం కావాలో నిర్ణయించేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల జనాభా కంటే ఎక్కువ నిధులే ఖర్చుచేయాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనుకున్న విధంగా ముందుకుపోతున్నదని, రాష్ట్ర ప్రగతి కూడా బాగుందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు దేశంలోనే అత్యధికంగా ఉందని, ఈ ఫలితం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఉపయోగపడాలన్నది తమ లక్ష్యమని సీఎం అన్నారు.

LEAVE A REPLY