పండుగొచ్చింది పల్లెకు పోతున్న పట్నం!

0
21

పండుగొచ్చింది.. పట్నం జనం సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో జరుపుకునేందుకు ఊళ్లకు తరలిపోతున్నారు. అదనపు రైళ్లు, ఇబ్బడిముబ్బడిగా బస్సులు నడుపుతున్నా జనం రద్దీకి చాలడం లేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలామంది రిజర్వేషన్ దొరుకక సతమతమవుతున్నారు. టీఎస్సార్టీసీ తెలంగాణ జిల్లాలకు 2430, సీమాంధ్ర పట్టణాలకు 750 అదనపు బస్సులను (మొత్తం 3180) నడుపుతున్నది. కాగా దక్షిణమధ్య రైల్వే 140 ప్రతేక్య రైళ్లను వేసింది. సొంత కార్లున్నవారు కూడా ఊరుబాట పట్టడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నత్తనడక నడుస్తున్నది. ఓ వైపు శబరిమలై సీజన్ నడుస్తున్నది. కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ సెలవులు ఇచ్చేశాయి. సర్కారీ స్కూళ్ల సెలవులు కూడా మొదలైతే రద్దీ మరింత పెరుగుతుందని అంటున్నారు.

LEAVE A REPLY