పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్.

0
35

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతున్నది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. మోడలింగ్ నుంచి చిత్రసీమలోకి ప్రవేశించిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నానని, కొన్ని సినిమాల నుంచి తనను అకారణంగా తప్పించారని వాపోయింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సుందరి కెరీర్ తొలినాటి రోజుల్ని మననం చేసుకుంది. ఆమె మాట్లాడుతూ మోడలింగ్ చేస్తూనే పాకెట్ మనీ కోసం ఓ కన్నడ చిత్రంలో నటించాను. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశమొచ్చినా చదువు ఆగిపోతుందనే భయంతో వద్దనుకున్నాను. ఆ తర్వాత కెరటం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్‌లో నటించే అవకాశం వచ్చింది. నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తప్పించారు. అందుకు కారణాలేమిటో ఇప్పటికీ తెలియదు అని చెప్పింది. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా ఆశించిన అవకాశాలు రాలేదని, చాలా చిత్రాల్లో తొలుత తనను ఎంపిక చేసుకొని తర్వాత తప్పించేవారని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here