న్యూఇయర్‌కు ‘వీఐపీ2’ వచ్చేశాడు

0
41

ధనుష్‌ కథానాయకుడిగా సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీఐపీ 2’. కాజోల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక సంవత్సరం ముగింపునకు వచ్చింది. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఇదిగో నా బహుమతి’ అంటూ సౌందర్య ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ నిర్మాణ భవనం పిల్లర్‌కు ఒకవైపు ధనుష్‌ ఉండగా మరోవైపు కాజోల్‌ నిలబడి ఉన్న చిత్రం ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here