నోట్ల ర‌ద్దును త‌ప్పుబ‌ట్టిన ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్‌

0
28

ప‌్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తప్పుబ‌ట్టారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ బిమ‌ల్ జ‌లాన్‌. ఈ నిర్ణ‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచ‌డం, ప్ర‌క‌టించిన స‌మ‌యంపై ఆయ‌న ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న నోట్ల‌ర‌ద్దుపై విస్ప‌ష్టంగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. 1997 నుంచి 2003 వ‌ర‌కు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలోనే బిమ‌ల్ జ‌లాన్ ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయ‌నే అదే ఎన్డీయే ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. నోట్ల ర‌ద్దులాంటి పెద్ద నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డానికి ఓ మంచి కార‌ణం ఉండాల‌ని బిమ‌ల్ అన్నారు. ఓ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన నోటును ర‌ద్దు చేయాలంటే ఓ మంచి కార‌ణం ఉండాలి. యుద్ధం, భ‌ద్ర‌త ముప్పులాంటివి. అయితే ప్ర‌భుత్వం మాత్రం న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. ఇక రెండోది.. ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించిన స‌మ‌యం. ఇప్పుడే ఎందుకు? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here