నోట్ల రద్దు తెలివితక్కువ నిర్ణయం

0
35

పెద్ద నోట్లు రద్దయి 30రోజులు గడిచినా నగదు కోసం సామాన్యులు ఇంకా అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్నది తెలివితక్కువ నిర్ణయం అని వ్యాఖ్యానించాయి. ఒక వ్యక్తి ఆర్థిక విపత్తును సృష్టించాడు అని ధ్వజమెత్తాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడి నెలరోజులు గడిచిన సందర్భంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో గురువారం బ్లాక్ డే పాటించాయి. కాంగ్రెస్ నేతలతోపాటు తృణమూల్, సీపీఎం, సీపీఐ, జేడీ(యూ), ఎస్పీ సభ్యులు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ప్రధాని తెలివితక్కువ నిర్ణయం దేశాన్ని నాశనం చేసిందన్నారు.

LEAVE A REPLY