నోట్ల రద్దు.. జైట్లీకి ముందే తెలుసు!

0
25

రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి సైతం తెలియదని వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ దీనిపై స్పందించారు. నోట్ల రద్దు విషయం జైట్లీకి ముందే తెలుసునని వ్యాఖ్యానించారు. స్నేహంగా, బాహాటంగా ఉండే ఆయన ఆయన దానిని రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు.

‘నోట్ల రద్దు బాంబు పడిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. దానిని జైట్లీ రహస్యంగా ఎలా ఉంచగలిగారని.. కొన్ని ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారు’ అని హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడరషిప్‌ సదస్సులో అన్నారు.

జైట్లీకి ఈ విషయం గురించి ముందే తెలుసా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘అవును కచ్చితంగా. ఎందుకంటే ఆయన ఆర్థికశాఖ మంత్రి’ అని తెలిపారు. రాయితీలను దుర్వినియోగం చేస్తున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుందని గోయల్‌ స్పష్టం చేశారు. నిజాయతీ కలిగిన ప్రజలను మోసం చేస్తున్న వారిని సైతం వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. నోట్ల రద్దు పక్కా ప్రణాళికతో తీసుకున్న నిర్ణయమని స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఈ చర్య కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించే అవకాశం ఉందన్న దానిపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం ఒక నెల లేదా ఒక త్రైమాసికం ఉండవచ్చు. అనధికార ఆర్థిక వ్యవస్థ నుంచి అధికారిక ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తాం’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY