నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం

0
34

నోట్ల రద్దు దేశంలో ఈ ఏడాది జరిగిన అతి పెద్ద కుంభకోణం అని, అవినీతి అంతం పేరుతో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సి వస్తే తాను రాజీనామా చేసే వాడినన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడికి తొలిసారి వచ్చిన చిదంబరం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులను ఉద్దేశించి, అడ్మినిసే్ట్రటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లో ‘పెద్దనోట్ల రద్దు-ఓ పరిశీలన’ అనే అంశంపై ఆదివారం ప్రసం గించారు. నోట్లరద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. అవినీతి అంతమవుతుందన్న మోదీ హామీ నెరవేరలేదని, లంచాలు తీసుకునే వారు పాత నోటు స్థానంలో కొత్త వి తీసుకుంటున్నారన్నారు. ఎవరినీ అడగకుండానే నోట్ల రద్దుపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. గత 50 ఏళ్లుగా ఏ దేశం కూడా నోట్లను రద్దు చేయలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో 3,400 కోట్ల నోట్లు రద్దయ్యాయని, రిజర్వ్‌ బ్యాంక్‌ తన నాలుగు ముద్రణాలయాల్లో 24 గంటల పాటు ముద్రించినా నెలకు 300 కోట్ల నోట్లు మాత్రమే బయటికొస్తాయన్నారు. ఈ లెక్కన రద్దయిన నోట్లన్నీ ముద్రించేందుకు 8 నెలలు పడుతుందన్నారు. మోదీ 100ు నగదు రహిత లావాదేవీలను కోరుకోవడం కార్పొరేట్ల ప్రయో జనం కోసమే అన్నారు. ఒక వంద రూపాయల నోటు ఒక రోజులో 10 మం ది చేతులు మారినా పన్నుపోటు ఉండదని, అదే వంద రూపాయలు డిజి టల్‌ రూపంలో 10సార్లు మారితే సర్వీస్‌ చార్జీ పేరిట వినియోగదారుడి నుంచి పేటీఎం వంటి థర్డ్‌ పార్టీకి ఒక్కో లావాదేవీకి రూ.1.50 చొప్పున రూ.15 చేరుతుందన్నారు. అంటే.. దేశంలో రోజూ లక్ష కోట్ల రూపాయల డిజిటల్‌ లావాదేవీలకు సర్వీస్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.1,500 కోట్లు సదరు సంస్థలకు చేరతాయన్నారు. అందుకే ఇది అతి పెద్ద కుంభకోణం అన్నారు. 10 మందిలో నలుగురు ఉపాధి కోల్పోయారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here