నోట్ల రద్దుకు చట్టబద్ధత.. చట్ట సవరణకు కేంద్రం రెడీ

0
28
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. నోటిఫికేషన్‌ ద్వారా పెద్ద నోట్లను వెనక్కు తీసుకున్న సర్కారు.. ఇప్పుడు రద్దుకు పార్లమెంటులో చట్టం చేయాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు ఆర్బీఐ చట్టాన్ని సవరించాలని, ఇందుకు రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చట్టబద్ధతపై ఇప్పటికే వివిధ కోర్టుల్లో కేసులు నమోదు కావడం, ప్రక్రియను
పాటించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. నిజానికి, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి చట్టం చేయడం తప్పనిసరి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా దీనిని తీసుకు రావాల్సి ఉంది. అయితే, 1978లో నోట్లను రద్దు చేసినప్పుడు ముందుగా ఆర్డినెన్స్‌ జారీ చేసి ఆ తర్వాత పార్లమెంటులో చట్టం చేశారు. ఇప్పుడు మాత్రం కేవలం నోటిఫికేషన్‌తోనే రాత్రికి రాత్రే చట్టపరంగా నోట్లు చెల్లవని చెప్పేశారు. దీనిని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here