నోట్లరద్దు మూన్నాళ్ల ముచ్చట కాకూడదు: ఈటల

0
23

తెలంగాణ:నోట్ల రద్దు నిర్ణయం ప్రజామోదం పొందాలని, అదే ఆశతో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఓపిగ్గా భరిస్తున్నారని మంత్రి ఈటల అన్నారు. శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సచివాలయంలో పెద్దనోట్ల రద్దు- వినియోగదారుల సమస్యలు- పరిష్కరాలు అన్న అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో భారతీయ సంసృతికి ప్రత్యేక స్థానం ఉంది. బొమ్మా బొరుసు ఉన్నట్లుగా సమాజమనేది మంచి చెడుల కలయిక. డబ్బు కేంద్రీకృతమైతే దేశంలో పేదరికం పెరుగుతుంది. 70 సంవత్సరాల తర్వాత కూడా మన రాజ్యాంగంలో ఆశించిన ఆశయాలు అమలుకాకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో పెద్దనోట్లను రద్దుచేయాల్సి వచ్చింది అని మంత్రి అభివర్ణించారు.

LEAVE A REPLY