నోట్లరద్దుపై స్వామి సంచలన వ్యాఖ్యలు

0
25

న్యూదిల్లీ: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్‌ 8న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు.

అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపైనా తీవ్ర విమర్శలు చేశారు. నోట్లరద్దు నిర్ణయం అమలు ఘోరంగా ఉందన్నారు. ఆర్థికవేత్తలైన ఆర్థికశాఖ మంత్రులు దేశానికి అవసరం కానీ..2+2=4అని చెప్పే వారు అవసరంలేదన్నారు. నోట్లరద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు. అలాగైతే నోట్లరద్దుతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు వచ్చినా అది 2019 ఎన్నికల్లో ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here