నోటిఫికేషన్ల వెల్లువ

0
15

రాష్ట్రంలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో తొమ్మిది నోటిఫికేషన్ల ద్వారా 7306 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రకటించిన ఉద్యోగాల్లో మహిళలకే అగ్రతాంబూలం దక్కడం విశేషం. ఈ పోస్టులకు ఈ నెల 10తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే నెల 4వ తేదీ తుది గడువు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు సమాచారం. 450 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల కోసం మరో ప్రకటన వెలువడనుందని తెలిసింది.

అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని 56 కొలువుల భర్తీకి నేడో, రేపో ప్రకటన విడుదల కానున్నదని తెలుస్తున్నది. ఇంతేకాకుం డా, గురుకుల్లాలోని 546 లెక్చరర్ల పోస్టులు, 90 లైబ్రేరియన్లు, పీడీల పోస్టులకు కూడా ఓ ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. రాబోయే వారం పది రోజుల్లో 552 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు ప్రకటనలు విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. కాగా, తొమ్మిది నోటిఫికేషన్ల ద్వారా గురుకులాల్లో భర్తీ చేయనున్న కొలువుల పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ HTTP://TSPSC. GOV.IN లో చూడవచ్చు.

LEAVE A REPLY