నైజీరియాలో శరణార్థుల శిబిరంపై వైమానిక దాడి

0
19

నైజీరియాలో బొకో హరాం తీవ్రవాదులను ఎదుర్కోవాల్సిన వైమానిక దళ యుద్ధ విమానం పొరపాటున శరణార్థుల శిబిరంపై బాంబులు వేయడంతో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయ సిబ్బంది గాయపడ్డారు. నైజీరియా ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. కామెరూన్ సరిహద్దు ప్రాంతంలో పొరపాటున బాంబింగ్ నిజమేనని మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబర్ నిర్ధారించారు. గాయపడినవారిలో ఇద్దరు సైనికులు, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ తరపున పనిచేస్తున్న నైజీరియన్లు, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. ఇలా పొరపాటున బాంబు దాడికి పాల్పడినట్లు నైజీరియా మిలిటరీ అంగీకరించడం బహుశా ఇదే మొదటిసారి. గతంలోనూ ప్రభుత్వం తరపున రోజువారీగా జరిగిన బాంబుదాడుల్లో పౌరులు మరణించినట్లు గ్రామీణ ప్రజలు ఆరోపించారు.

LEAVE A REPLY