నేషనల్ డిజిటల్ లైబ్రరీతో ప్రయోజనం

0
8

చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు… ప్రపంచం మీ చేతిలో ఇమిడి పోయినట్లే. మీకు దొరకని పు స్తకాలను సైతం మీకు అందుబాటులో ఉన్నట్లే…ఒక్కసారి ఆండ్రాయిడ్ స్క్రీన్‌పై స్వైప్ చేస్తే చాలు మీకు కావాల్సిన పుస్తకాలు, సమాచారం మీ ముందు ఆవిష్కృతమవుతాయి. ఆండ్రాయిడ్ సహాయంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ నుంచి లక్షల పుస్తకాలను ఉచితంగా చదువుకోవ చ్చు. మినిస్ట్రీ ఆఫ్ హ్యుమన్ రీసోర్సెస్, ఐఐటీ, ఖర్‌గపూర్ సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో వెబ్‌సైట్ రూపకల్పన చేశారు. ఆ వివరాలు ..

మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఐఐటీ, ఖరగ్‌పూర్ సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో వెబ్‌సైట్ కు రూపకల్పన చేశారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రాథమిక స్థాయి (ఒక తరగతి) నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచారు. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు 70 భాషల్లో పుస్తకాలను ఉంచారు. దాదాపు 2లక్షల మంది రచయితలు రాసిన మూడు లోల కథనాలు. 3లక్షల మం ది రచయితలకు సంబంధించిన ఏడు లక్షల పుస్తకాలు ఉన్నాయి. 262కు పైగా ఆడియో కథనాలు 18, 587 వీడి యో పాఠాలున్నాయి. బీటెక్ తరువాత గేట్ పరీక్షకు అవసరమయ్యే పుస్తకాలతో పాటు కంప్యూటర్, వ్యవసాయ, సమాచార, సాధారణ తత్వశా స్త్రం, మనస్తత్వశాస్త్రం, సం ఘసేవ తదితర రంగాలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి.

మహానుభావుల చరిత్ర పుస్తకాలు, ఒకటి నుం చి పీజీ, వృత్తి విద్యా కోర్సు విద్యార్థులను అవసరమైన పుస్తకాలు ఈ వెబ్‌సైట్‌లో కోకొల్లలుగా ఉన్నాయి.

LEAVE A REPLY