నేరం రుజువైతే పరిహారం చెల్లిస్తా: ముద్రగడ

0
15

తునిలో జరిగిన రైలు దహనం ఘటనలో తమపై నేరం రుజువైతే తన ఆస్తులమ్మయినా నష్టపరిహారం చెల్లిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో కాపు వనసమారాధన కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తర్వాత కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వాడపల్లిలో రాత్రికి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పరిహారానికి తన ఆస్తులు చాలకపోతే.. కాపు జాతి భిక్షాటన చేసి పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన ఘటనలో సీఎం చంద్రబాబుపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్రపై వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.

LEAVE A REPLY