నేనూ సాధారణ అమ్మాయినే, కుజుడిపై అడుగు పెడతా

0
20

‘‘మార్స్‌ మీదకు వెళ్లడం చెప్పినంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక సవాళ్లను అధిగమించాల’ని నాసా శాస్త్రవేత్త జాస్లీన్‌ జోసన్‌ అన్నారు. మార్స్‌ మిషన్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం 2030లో భాగంగా ఈమె భారతకు వచ్చారు. అంగారకుడిపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు వివరిస్తున్నారు. భారతదేశంలో 30 యూనివర్శిటీలు 30 పాఠశాలలను ఆమె సందర్శిస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని మలక్‌పేట అస్మాన్‌ ఘడ్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలను సందర్శించారు. నాసాలో తన అనుభవాలతో పాటుగా తాను పాల్గొనబోతున్న మార్స్‌ మిషన్‌, వ్యోమగామిగా పొందుతున్న శిక్షణ తదితర అంశాల గురించి 30 నిమిషాల పాటు ప్రదర్శన ఇచ్చారు. అనంతరం విద్యార్ధులతో ముచ్చటించారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థీ అందిపుచ్చుకోవాలన్నారు.

LEAVE A REPLY