‘నేను లోకల్‌’ అమెరికా వసూళ్లు

0
28

నాని కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను లోకల్‌’ చిత్రం అమెరికాలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం యూఎస్‌ఏలో ఆదివారం ఒక్కరోజే 105,466 డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్స్‌ 750,628 డాలర్లకు (5.04 కోట్లు) చేరినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అమెరికాలో ‘నేను లోకల్‌’ వన్‌ మిలియన్‌ డాలర్ల దిశగా పరుగులు పెడుతోందని ఆయన పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో కీర్తిసురేష్‌ కథానాయికగా నటించారు. నవీన్‌చంద్ర, పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

LEAVE A REPLY