నేను బతికే ఉన్నా

0
24

డ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు ప్రసారమైన వార్తలపై ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు ఇన్‌దీప్‌ భక్షి స్పందించారు. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అవన్నీ పుకార్లే అని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదంలో భక్షి మరణించినట్లు సోషల్‌ మీడియాలో గురువారం విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయం  తన మిత్రుల ద్వారా తెలుసుకున్న భక్షి దీనిపై వివరణ ఇచ్చారు.

తాను ఎటువంటి రోడ్డు ప్రమాదానికి గురికాలేదని, క్షేమంగా ఉన్నట్లు ఇన్‌దీప్‌ ప్రకటించారు. ఇటువంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆయన అభిమానులకు సూచించారు. తన కుటుంబీకులు ఈ విషమయై తీవ్రంగా మదనపడినపట్లు చెప్పారు. ‘సాటర్‌డే..సాటర్‌డే’, ‘కాలచస్మా’ లాంటి హిట్‌ పాటలకు భక్షి నేపథ్యగానం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here