నేను క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదు’

0
29

కొన్ని నెలలుగా మోచేతి గాయంతో బాధపడుతూ ప్రధాన క్రికెట్ సిరీస్ లకు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన టెస్టు రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. తాను టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడం లేదని తాజాగా స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ తనకు ఆ ఆలోచనే రాలేదని విషయాన్ని గ్రహించాలని అభిమానులకు సూచించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ పగ్గాలు నుంచి ఏబీ వైదొలిగిన నేపథ్యంలో అతని రిటైర్మెంట్ కు సంబంధించి రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే దీన్ని ఏబీ ఖండించాడు. తన మోచేతికి శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత ఇంటి వద్దనే ఉంటున్న ఏబీ డివిలియర్స్.. తాను త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు తాను అందుబాటులో ఉండటం లేదని ఏబీ పేర్కొన్నాడు. కాగా, ఇది తన టెస్టు రిటైర్మెంట్ కాదనే వాస్తవాన్ని గ్రహించాలన్నాడు.’2019 వరల్డ్ కప్ వరకూ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. నా దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టాలనేది నా కోరిక. అది నేరవేర్చిన తరువాత క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ క్రికెట్ ఆడతా. ఇక్కడ అభిమానులు మరొక విషయం కూడా గుర్తించాలి. నేను ఏ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఆ మేరకు ప్రణాళికలు కూడా ఏమీ లేవు’అని ఏబీ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here