నేనింకా పూర్తిస్థాయి క్రీడాకారిణిని కాదు

0
17

ఒలింపిక్‌ పతకం సాధించినప్పటికీ తాను పూర్తిస్థాయి క్రీడాకారిణిని కాదని, ఇంకా నేర్చుకోవల్సింది ఎంతో ఉందని భారత షట్లర్‌ పీవీ సింధు అన్నారు. సయ్యద్‌ మోది గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పాల్గొన్న సింధు మీడియాతో మాట్లాడుతూ.. ఆటలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని, దానికి తగ్గట్లుగా ఆడేందుకు ఎంతో కష్టపడాలని తెలిపారు. తాను ఎప్పటికి పూర్తిస్థాయి క్రీడాకారిణిననుకోనని, ప్రదర్శన మెరుగుపరుచుకునేందుకు ఎప్పుడూ కష్టపడుతుంటానని చెప్పారు.

లక్ష్యాల గురించి అడగగా… ప్రస్తుతం సయ్యద్‌ మోది టోర్నీ గెలవడమే తన ముందున్న లక్ష్యమని సింధు తెలిపారు. ఆ తర్వాత వరుసగా ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నమెంట్‌, సూపర్‌ సిరీస్‌లు జరగనున్నాయన్నారు. తాను ఏయే టోర్నీల్లో పాల్గొనాలనేది.. ఫిట్‌నెస్‌ ఆధారంగా కోచ్‌ ఎంపిక చేస్తారని సింధు చెప్పారు.

LEAVE A REPLY