నేత్రదానం చేస్తానన్న హృతిక్‌

0
24

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌,నటి యామీ గౌతమ్‌లు జంటగా నటించిన కాబిల్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకొంది. ఇందులో హృతిక్‌, యామీలు అంధులుగా నటించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ సినిమాకి కళ్లే ప్రాణం. అంధుడిగా నటించడానికి సినిమా చిత్రీకరణ మొదలవడానికి ముందు హృతిక్‌ ఎంతో కష్టపడ్డాడు. ఈ నేపథ్యంలో నేత్రదాన ప్రాధాన్యాన్ని చాటుతూ హృతిక్‌ తన కళ్లను దానం చేస్తానని వాగ్దానం చేశాడు. హృతిక్‌ జనవరి 10న తన పుట్టినరోజు జరుపుకొన్నాడు. అదేరోజు నేత్రదానం చేస్తానని వాగ్దానం చేస్తూ పత్రాలపై సంతకం చేశాడు.

ఈ విషయమై ఆదిత్య జ్యోత్‌ కంటి ఆస్పత్రి డైరెక్టర్‌, ఛైర్మన్‌ డా.ఎస్‌ నటరాజన్‌ మాట్లాడుతూ.. ‘కాబిల్‌ ట్రైలర్‌ చూసినప్పుడు రాకేశ్‌ రోషన్‌తో ఫోన్‌లో మాట్లాడాను. హృతిక్‌ తన కళ్లను దానం చేస్తాడా అని అడిగాను. అప్పుడు హృతిక్‌ అదే పనిచేయబోతున్నాడని చెప్పగానే ఎంతో సంతోషించాను. అప్పుడు హృతిక్‌తో మాట్లాడితే తన పుట్టినరోజును నేత్రదానం తాలూకు పత్రాలు నింపి జరుపుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఈ విషయాన్ని హృతిక్‌ బయటికి చెప్పద్దని కోరాడు. కానీ మిగతావారిలో స్ఫూర్తి నింపడానికి హృతిక్‌ నేత్రదానానికి హామీ ఇచ్చిన విషయాన్ని చెప్తున్నాను’ అన్నారు. అంతేకాదు భారత్‌లో త్వరలో జరగబోయే నేత్రదాన ప్రచార కార్యక్రమంలోనూ హృతిక్‌ పాల్గొనబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here