నేతల వద్ద డబ్బు తీసుకుని డంపుల్లో దాస్తున్నారు

0
20

‘నక్సలైట్లు ఎవరు..? అవినీతి అడవిలోనే ఉందా? పేదవాళ్లను చంపడానికే నక్సలైట్లు వచ్చారా? రాజమహేంద్రవరంలో అవినీతి లేదా.. ఇక్కడికి వచ్చి మావోయిస్టులు ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను చంపమనండి. వీళ్ల వద్ద డబ్బులు తీసుకుని డంప్‌లో దాచుకుని తర్వాత లొంగిపోతున్నారు. అడవిలో పడుకోవడం కాదు. దమ్ముంటే బ్యాగ్‌వేసుకుని వచ్చి ఇక్కడ తిరగమనండి’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డంపుల్లో దాచుకున్న సొమ్మును వెలికితీయడం కోసమే కేంద్రం పెద్దనోట్లను రద్దుచేసిందని తెలిపారు. ‘మద్యం ద్వారా రూ.39 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో 10 వేల కోట్లు దారి మళ్లుతున్నాయి. వీటిని దళారులు తినేస్తున్నారు. కొన్నిచోట్ల గ్రానైట్‌ రాళ్లను పట్టుకుపోతున్నవారిని పట్టుకుంటే ఎమ్మెల్యేలే వదిలేయమంటున్నారు.

LEAVE A REPLY