నేడే సామూహిక ఇండ్ల ప్రవేశ సంబురం

0
19

తెలంగాణ:ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలలో పండుగ వాతావరణం నెలకొన్నది. డబుల్ బెడ్‌రూం ఇండ్ల సామూహిక ప్రారంభ సంరంభం శుక్రవారం ఉదయం 7.53 గంటలకు 600 మంది బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ మధ్య జరుగనున్నది. గతేడాది ఇదే తేదీన ఆయుత చండీయాగం ఆరు రోజుల పాటు నిర్వహించిన సంగతి తెలిసిందే. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీన రెండు గ్రామాలు సామూహిక గృహ ప్రవేశ ఘట్టానికి వేదికగా మారుతున్నాయి. ఉదయం ఎర్రవల్లిలో పైలాన్ ఆవిష్కరణకు వచ్చే సీఎం కేసీఆర్‌కు 21 మంది వేద పండితులతో స్వాగతం పలుకుతారు. ఉదయం7.45 గంటలకు కల్యాణ మండపాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత రెండు గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా ప్రకటిస్తారు. పౌరులందరికీ బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకాలు.. డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారులకు ఎల్‌ఈడీ బల్బులు, ఫ్యాన్లు పంపిణీచేస్తారు. తర్వాత రెండు గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామిరెడ్డి నమస్తే తెలంగాణకు చెప్పారు.

LEAVE A REPLY