నేడు మూడవ టీ-20

0
11

మూడు టీ-20ల సిరీస్‌లో తొలి టీ-20లో టీమిండియా గెలవగా, రెండో టీ-20లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఇక చివరిదైన సిరీస్ నిర్ణయాత‍్మక మ్యాచ్‌పై ఇరు జట్లు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తొలిసారి ఇంగ్లండ్‌ గడ్డపై టీ-20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుంటే.. సొంత గడ్డపై సిరీస్‌ను కోల్పోకూడదనే పట్టుదలతో ఇంగ్లండ్‌ ఉంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వెన్నువిరిచిన స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్ రెండో మ్యాచ్‌ లో తేలిపోయాడు. మరో స్పిన్నర్ చహల్‌ ఒక వికెట్‌ తీసి భారీగా పరుగులు సమర్పించున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ ఉమేశ్‌ యాదవ్ వికెట్లు తీసినా కానీ పరుగులను మాత్రం నియత్రించలేకపోయాడు

LEAVE A REPLY