నేడు పేదరిక నిర్మూలనపై సీఎం ప్రసంగం

0
22
ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీలంకలో ఘనస్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆహ్వానం మేరకు శనివారం రాత్రి అక్కడకు వెళ్లిన సీఎంకు విమానాశ్రయంలో శ్రీలంక సిటీ ప్లానింగ్‌, నీటి సరఫరా మంత్రి సుదర్శిని, విదేశాంగ ఉపమంత్రి హర్ష డిసిల్వా, పశ్చిమ ప్రావిన్స్‌ గవర్నర్‌ లోగేశ్వరన్‌, అధ్యక్ష సచివాలయం ప్రోటోకాల్‌ చీఫ్‌ రంజన్‌ ధర్మవర్ధన తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, సీఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సహా ఎనిమిది మంది సభ్యుల బృందం శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి కొలంబో చేరుకుంది. విమానాశ్రయం నుంచి సీఎం ముందుగా హోటల్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడి నుంచి నేరుగా వెళ్లి సిరిసేనను కలిశారు. ఉభయులూ 25 నిమిషాలపాటు ముఖాముఖి మాట్లాడుకున్నారు. అనంతరం బాబు గౌరవార్థం సిరిసేన విందు ఇచ్చారు.

LEAVE A REPLY